![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -301 లో.... శ్రీధర్, కావేరి లు కాంచన దగ్గరికి వస్తారు. అక్కడ వాళ్ళు శ్రీధర్ ని పట్టించుకోకుండా కావేరికి మర్యాద చేస్తుంటే అతనికి కోపం వస్తుంది. వచ్చిన పని ఏంటో చెప్పండి అని కార్తీక్ అంటాడు. ఆ శివన్నారాయణ వీలునామా రాయించాడంట.. అందులో మీకు రాశాడో లేదో అని కనుక్కోండి అని శ్రీధర్ అంటాడు. మాకు అవసరం లేదని కాంచన చెప్తుంది. దాంతో శ్రీధర్ డిస్సపాయింట్ అవుతాడు.
శ్రీధర్ తనకి వాటా వస్తుందని సెల్ఫిష్ గా ఆలోచిస్తాడు కానీ కాంచన, కార్తీక్ లు వద్దని చెప్పడం తో కోపంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత శ్రీధర్ ఇంటికి వచ్చి.. ఆ శివన్నారాయణ ఆస్తులు ఎవరి పేరున రాశాడోనని అనుకుంటూ ఉంటే ఆయన ఎవరి పేరున రాస్తే ఏంటి అక్కకి వస్తే అందులో మీకు వాటా వస్తుంది అనేగా అని కావేరి అంటుంది. గట్టిగా అనకే నాకు వస్తే నీకు వస్తుంది కదా అని శ్రీధర్ అంటాడు. అయిన మీకెందుకు ఇస్తారని కావేరి వెటకారంగా మాట్లాడుతుంది. శత్రువువులు ఎక్కడో లేరు.. ఇంట్లోనే ఉంటారని శ్రీధర్ అనుకుంటాడు.
మరొకవైపు రెస్టారెంట్ కి సత్యరాజ్ వచ్చి కార్తీక్, దీపలతో మాట్లాడతాడు. మీకు మూడు నెలల టైమ్ ఇచ్చాను కానీ ఫస్ట్ వీక్ లోనే రెస్టారెంట్ ప్రాఫిట్స్ చూపించారు.. చాలా గ్రేట్.. మీకు నచ్చింది చేయండి ఒకసారి వంటలు టేస్ట్ చూడడానికి వచ్చాను. చాలా బాగున్నాయంటూ కార్తీక్ , దీపలని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత మిమ్మల్ని ఒకటి అడగాలని కార్తీక్ తో దీప అనగానే ప్రాణాధాత గురించా అంటూ సరదాగా మాట్లాడుతాడు కార్తీక్. నేను అడగాలనుకుంది. మీ తాతయ్య వీలునామా విషయం గురించి అని దీప అనగానే.. ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవద్దని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |